టిష్యు పేపరువా?
ఓ…
బ్లోజాబ్ ఉద్యోగి దానా
నీవు కామ పశువులకు దానావే
నీ సౌందర్యాన్ని
తెంచి కాసేపు పక్కనెట్టు
నీకు పూసిన
ఆరొండు మెత్తని పూలను
వాడిపోగొట్టు
తాపీ ధర్మారావిచ్చిన
ఇనుప కచ్చడాన్నొకదాన్ని
ముందు ద్వారంకు తాళంవెయ్
నీకున్న లేతెర్రని పెదాల గులాబీలను
తుంచి కాల్వలో పాడేయ్
అప్పుడు... జూడు
నీ ఉద్యోగంకెవ్వడు జీతమివ్వడు
ఆరోగ్యమెవ్వడు పట్టించుకోడు
నీకు లేని విలువ
నీయంగాలకుందనెందుకే
తెల్సుకోవు
నీ ఉద్యోగం పత్తిత్తుల్ని
నిరుద్యోగుల్ని చేస్తుంది
ఓషో సూత్రాలకలవాటు పడి
ఓయోలకొస్తున్నారు నీకోసం
నీవేమో చర్మన్నాకుక్కలకొదిలేస్తావ్
చిత్తకార్తి కుక్కల్ని తయారుచేస్తావ్
నీ మాదిరి
అంతర్జాల అంగట్లో
అమ్మకానికొచ్చిన అమ్మడులెందరో
- నేను కాదు 03.05.2020
మేడ్చల్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి