నా సెల్ 9000470542

కరోనా కట్టడి

కరోనా కట్టడి దేశ భవితకు పునాది             
                               


                "చాలామంది చాలా రంగాలలో చాలా సంఘర్షణ కొనసాగిస్తేనే గాని జీవితంలో సుఖ పరిణామాలకు దారి ఏర్పడదు. జీవితం నిండా పురోగమనానికి అడ్డుతగిలే శిథిలాలు ఉన్నాయి. వాటిని నిర్మూలించిన మీదటే గాని కొత్త నిర్మాణానికి అవకాశాలు ఏర్పడవు". అని కొడవటిగంటి కుటుంబరావు గారు కరోనా వైరస్ లాంటి విపత్కర పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఇలా అని ఉండవచ్చు. ఈ కరోనా వైరస్ చైనా దేశంలోని వుహాన్ అనే ప్రాంతంలో పుట్టినట్టు వైద్యుల ప్రాథమిక పరిశోధనలో వెల్లడయింది. ఇలా ఉద్భవించిన ఈ సూక్ష్మ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని మరణ భయానికి గురి చేసి బెంబేలెత్తిస్తుంది. 
        ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక జనాభా గలిగిన చైనా జాతిలో ఈ వైరస్ పురుడుబోసుకొని క్రమంగా ఒక్కో దేశానికి త్రాచు పాము వేగం మాదిరి పాకసాగింది. రోజులు ఏవిధంగా అయితే ముందుకు పోతున్నాయో, అంత కంటే వేగంగా కరోనా మరణాలు విజృంభిస్తున్నాయి. ఇలాంటి విషాద సమయంలో అఖండ మానవ వనరులు అంతటా పేకమేడల్లా కూలిపోతున్నాయి. ఏ దేశానికైనా, జాతికైనా ప్రధాన వనరు మానవ వనరే. ఒక దేశం అభివృద్ధి బాటలో పురోగతి సాధించాలన్న దానికి కావలసిన ముఖ్య వనరు కూడా ఈ మానవ వనరే. మరి అంతటి విలువైన వనరు ఇప్పుడు ప్రాణ భయంతో గుండెను గుప్పిట్లో పెట్టుకొని లబడబ్ శబ్దాన్ని భయంతో వింటున్నది. 
       ఈ వైరస్ ప్రపంచాన్ని కుదిపేస్తున్నదన్న విషయం పసిగట్టిన ప్రపంచ ఆరోగ్య సంస్థ దాని నివారణకు తగు జాగృత్తలు తీసుకోవడం ప్రారంభములోనే మొదలుపెట్టింది. ప్రతి దేశానికి కూడా అవసరమైన వైద్య సౌకర్యాలు కల్పిస్తుంది. అధునాతనమైన వైద్య యంత్రాలను సకాలంలో సమకూరుస్తున్నది. దీనికి ప్రతిస్పందనగా బాధిత దేశాలు కూడా ఆరోగ్య సంస్థ సూచనలను తూ.చ తప్పకుండా పాటిస్తున్నాయి. అందులో ప్రధానంగా మన భారతదేశ విషయానికి వస్తే కాస్త ఊరటమైన శ్వాసను పీల్చుకోవచ్చు. ఎందుకంటే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం వల్ల స్వల్ప సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. ఇది విషాదాన్ని మిగిల్చిన సంఘటనే అయిన కంట నీరు తుడుచుకోక తప్పడం లేదు. 
             ఇతర ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే ' గుడ్డి కన్నా మెల్ల నయం' అన్నట్టు మరణాలలో అయిన, నివారణ చర్యలలో అయిన, ముందస్తు నిర్ణయాలలో అయిన తక్కువ గణాంకాలలోనే ఉన్నాం. ఇది సంతోషించదగ్గ విషయం కూడా. ఈ గణాంకాలను సున్నాగా నమోదు చేయాలంటే మనం ఇప్పుడున్న పరిస్థితులలో జాగ్రత్తలు ఇంకా కూడా పాటించక తప్పదు. కరుణ లేని ఈ కరోనా వైరస్ మన ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నది. దీనికి ఎవ్వరు కూడా అతీతులు కారు. ఒకప్పుడు మన దేశాన్ని బానిసగా చేసుకొని పరిపాలించిన బ్రిటన్ అధ్యక్షుడికి కూడా ఈ భీమారి సోకింది. కనుక చిన్నా,పెద్దా అనే వయః భేదం లేకుండా ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాలని అటు దేశ ప్రధాని గౌరవ శ్రీ నరేంద్ర మోదీ గారు అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రశేఖర రావు గారు కూడా పటిష్టమైన చర్యలు అమలు చేస్తున్నారు. ఇందుకు గాను మనమంతా పరస్పరం సహకారాన్ని అందించుకుంటూ ఈ రోగాన్ని మన రాష్ట్రం నుంచి, మన దేశం నుంచి పూర్తిగా తరిమేసేందుకు అందరూ నడుం బిగించాలి. అట్లాగే పొరుగు దేశాలకు ప్రయాణాలు మానుకొని అక్కడ కూడా దాన్ని అంతం చెయ్యాలి. 
          ఈ కరోనా బాధితులు, మరణించిన వారు, కోలుకున్నవారి వివరాలు కనుక గమనిస్తే 
ప్రపంచ వ్యాప్తంగా :
మొత్తం కేసులు: 15,77,360
మరణాలు : 93,637
కోలుకున్నవారు : 3,48,077

 దేశం               కేసులు మృతులు
 అమెరికా      4,55,445   16,114
 స్పెయిన్       1,52,446 15,238
 ఇటలీ          1,43,626 18,279
 ఫ్రాన్స్           1,17,749 12,210
 జర్మనీ          1,15,523 2,451

ఈ సంఖ్యలో ఉండగా…
మన భారతదేశంలో అయితే
మొత్తం కేసులు : 5,865
మృతులు : 169
కోలుకున్నవారు: 478

అదే మన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం
  
కోవిడ్ 19 పాజిటివ్ లు      471 
కోలుకున్నవారు                  45
మరణాలు                         12
చికిత్స పొందుతున్న వారు  414
(పై గణాంకాలు అన్ని నమస్తే తెలంగాణ దిన పత్రిక ప్రకారం ఏప్రిల్ 10వ తేది నాటికి చెందినవి)
మన పొరుగు తెలుగు రాష్ట్రం అయిన ఆంధ్రప్రదేశ్ లో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 363 గా ఉంది.
    
    ఇంతటి విజృంభనమైన ఘోర పరిస్థితిలో ప్రజలంతా తమ తమ ఇళ్లకే పరిమితమై సహకారాన్ని అందిస్తున్నారు. ఇది చాలా ముదావహం. అలాగే ఈ భీకర స్థితిలో తమ ప్రాణాలను పణంగా పెట్టి కుటుంబాలకు దూరంగా ఉంటూ రాత్రి పగలు తేడా లేకుండా విధులు నిర్వహిస్తున్న వివిధ శాఖలను వారి పని తీరును మెచ్చుకోవాలి. ఆ శాఖలు ప్రధానంగా పోలీసు, వైద్య, పారిశుద్ధ్య కార్మికులు. ఈ మూడు శాఖల వారు తమ కర్తవ్యాన్ని పున్నమి నాటి చంద్రుడిలా నిర్వర్తిస్తున్నారు. పోలీసు కుటుంబాలే కాకుండా మిగతా రెండు శాఖల అధికారులు, ఉద్యోగులు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తున్నారు. ఈ తరుణంలో రాష్ట్ర ప్రజలే కాక దేశ ప్రజలంతా కూడా వీరికి ఎంతో ఋణపడి ఉండాలి. ఒకరికొకరు సహకరించుకొని ఈ కోవిడ్ భూతాన్ని ఈ భూమిపై నుంచి తరిమేసే దిశగా అందరం బాధ్యతగా మెలుగుదాం.



                                వ్యాసకర్త 
                ఘనపురం సుదర్శన్ M.A (ph.d)
                ARPC 8369
                CAR cyberbad 
                Cell: 9000470542

     

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కవిత్వం

ఒక స్త్రీ తన జీవితంలో ఎన్నోసార్లు పుష్పిస్తుంది. తాను పుష్పించిన ప్రతిసారీ తన పరిమళాన్ని తానే అసహ్యించుకుటుంది. 

వ్యాసం