నా సెల్ 9000470542

తోక ముడిచిన కరోనా


కరోనా వైరస్ యావత్ జనాన్ని భయానికిఈ గురి చేస్తుంది. దీన్ని అరికట్టేందుకు సకాలంలో జాగ్రత్తలు తీసుకోవాలి. దీని పట్ల ప్రజలలో ధైర్యం నింపడానికి ఈ కవితను రాస్తున్నాను.



ఉషోదయపు ఎర్ర్రని కిరణం
ఉదయాన తలుపు తట్టిన తరుణం
చేతులు కడుక్కోమని చెప్పిన సందేశం
నాన్నమ్మ పెట్టిన సింధూర తిలకం 
నన్ను నిద్రలేపి జాగ్రత్త పడమన్నాయి
పెరటిలో పెరిగిన పూదీన ఆకులు
గుమ్మం ముందున్న తులసి మొగ్గలు
రంగవల్లిలోని పసుపు ముగ్గులు
వంటింట్లో పాత్రల్లో దాక్కునే ఔషధులు
ఇపుడు మేం సహాయులమన్నాయి
వేదం పలికిన వీణ నాదం
పెద్దలు బోధించిన పద్యాల గణం
సంస్కృతి పుట్టుక సమధర్మం 
పొత్తం చెప్పిన పుత్తడి పదం
గండం తప్పించే దండం సరైనదంటున్నాయి
సరిహద్దు దాటి హద్దు మీరుతు
గుళ్లకు ఇళ్లకు చేరువ అవుతు
గుంపులు కట్టగ గమ్మున చేరుతు
ధ్యాస పోగొట్టి శ్వాసపై దాడి చేస్తూ
గుండెల్లో గుబులు పుట్టిస్తూ
కనికరం లేని కరోనా 
పరుగులు పెట్టిస్తుంది దినదినాన
ఆపత్కాలం అందరం ఒక్కటై
ఇంటికే అంతా బంధీలమై
కలిసికట్టుగా ప్రాణం కొరకై
రాబోయే పిల్లల తరాలకై
అంతా మనమంతా లోగిలి
పంజరాన దాక్కుందాం
అఖండ అండ మన వైపుండగా
దిక్కు మొక్కు లేని చిన్న కణం
గుడిసె గుడిసెకో గుండె ధైర్యముండగా
ఒంటరి పిట్టకు మనతోనా రణం
మనలో పుట్టిన వదంతులన్ని
మన భవితకే గాయం తమ్మి
వట్టిమాటలు మూటలు కట్టి
దేశ జగతికై దారిని వేసి
మనలో మనమై కలిసికట్టుగా
వాయువు లేక ఆయువు లేదని
అందరమొకటై బంధువులవుదాం
కరోనా గొంతుకు కంచెను వేసి
కోవిడ్ కాళ్లకు సంకెళ్ళు వేసి
బతుకుదాం బతుకును 
ప్రసాదిద్దాం

08.04.2020



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కవిత్వం

ఒక స్త్రీ తన జీవితంలో ఎన్నోసార్లు పుష్పిస్తుంది. తాను పుష్పించిన ప్రతిసారీ తన పరిమళాన్ని తానే అసహ్యించుకుటుంది. 

వ్యాసం