సైనికుడికో ఉత్తరం
ప్రియాతి
ఓ సైనికుడా
పగల్లేని వెన్నెల్లో
జాబిలివై ఎందుకోయ్
వెళుతురును తరిమేస్తావ్
చీకటంటే నీకంత ఇఛ్చనేమో
కొండల నడుమ బండల్ని కాదని
బందూకులతో సంసారం చేస్తున్నావ్
సీతామాతా పుట్టిన ధరణిశయ్యపై
నిశీధి ఆకాశాన్ని రగ్గుగా మల్చుకొని
మంచులో ముంచుకొని వచ్చే
శత్రువులతో పోరాటమంటే నీకెంత బాధ్యత
బూట్ల శబ్దాన్ని బుల్లెట్ల బరువుని
నీ గుండె గదుల్లో బంధిస్తావ్ కదా
నువక్కడ జాతికోసం జాగారం చేస్తే
ఇక్కడ నీతిలేని శునకాలు
సింహాసనం కోసం చీకట్లో తన్నుకుంటున్నాయ్
భారతావనిలో వనితలెందరున్న
భరతమాతలో కనబడేది నీ రూపమే
భరతమాతకు విలువివ్వని
భర్తలున్న నా దేశంలో ప్రతీవాడొక భరతుడే
అట్లాగని వీడు నాట్యశాస్త్ర
భరతుడేం కాదు
మోక్షం కోసం ముఖానికి
రంగులద్దుకున్న పచ్చి అభినేత
06.05.2020
అంతారం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి