మొగుడా? కాల యముడా?
పురిటి సమయంలో పడ్డ
నొప్పులన్ని కడుపులో
కుప్పలయ్యాయి
ధ్వంసం చేద్దామంటే
పునాది సమాధిలా
మారింది
కదలకుండా కన్నీరెట్టించింది
కడుపు కోసి
కత్తెరను మరిచిన
కాపలా చెల్లి ఎవరో
తల్లి బాధ తెలియని
అసంబంధ శాంతి ఎవరో
ఎవడు శంకుస్థాపన
చేసేనో!
ముఖ్యాతిథిని ఎవరు
ఆహ్వానించారో!
సన్నాయి శబ్దాన్ని
వినాలనుకున్న చెవులు
ఏడుపును విన్నాయి
గొడ్రాలువని మందు
రాసిన చేతులే
నా కొడుకు బొడ్డు తాడును కోసాయి
ఏడుస్తున్న పిల్లాడి
చప్పుడు విని
కసాయి వాడి కోతలే
నయమనుకున్న
భరిస్తున్న
కఠిన భర్త దెబ్బలకు
తగిలిన గీతలను
చెరుపుకున్న
పుట్టినప్పుడే గట్టిపడిన
మనసు గాయం
రూపాయి కన్నా పాపాయికే
తెలుసు జ్ఞానం
జోల పాటకి నిలయమౌతదనుకున్న
నోరు
లాలికి కరువైంది
జబ్బలు చరుస్తూ
దెబ్బలు కొట్టిన భర్తకు
ఆళినయ్యాను
ఆకలికి దమ్ము పట్టినా
రొమ్ముని పట్టని బిడ్డకి
తల్లినయ్యాను
కుటుంబానికి నిలువనిచ్చే
ఇంటికి కోడలిని మాత్రం
కాలేకపోయాను
-ఘనపురం సుదర్శన్
Cell 9000470542
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి