నా సెల్ 9000470542

         గమ్యమెరగని బాటసారి



నమ్మిక లేక
అమ్మిక పోవక
నడిచెళ్తున్న బాటసారి
గర్భవతి భూగోళం పై
చంక ఎక్కిన చంటిపిల్ల
ప్రాణ తీపికి దారినెఱిగి
వలసవెళ్లిన వేలమందికి
మిగిలిందేయిక కన్నీటి కష్ట గోస
దారి తెలియక దూరం 
మరిచి
ఉండిపోయిన జాడను కాదని
వెడలివెళ్తున్న 
వేల కాళ్లకు వేళ లేదిక

ఎండ వేడికి గొంతు మండిన
గుప్పెడు నీరుతో గుండెను తడిపి
స్థైర్యం పొందిన 
పాద చారులు
మూటలు కట్టి పేటను వదిలి
పారే రుధిరం 
ఇంధనమనుకొని
ఇంటికెళ్తున్న 
ఇంతులెందరో


           -సితార. 24.04.2020





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కవిత్వం

ఒక స్త్రీ తన జీవితంలో ఎన్నోసార్లు పుష్పిస్తుంది. తాను పుష్పించిన ప్రతిసారీ తన పరిమళాన్ని తానే అసహ్యించుకుటుంది. 

వ్యాసం