బాలింత బిడ్డ
పిల్లాడి నోరు ఆకలికి
బానిసవలేక
పాల కోసం తల్లి
చనుమొనలకు
చూరుకు పట్టిన
గబ్బిలంలా వేలాడుతుంది
పదిమందిలో ఉన్న ఆ బాటసారి తల్లి
సిగ్గుపడలేక
పాలివ్వనంటుంది
కాలువల ఉన్న ఆకలి
ఏడుపు కన్నీళ్లు
పాలు లెవనుకొని
నాలుకను తాకుతున్నాయి
పిక్కటిల్లేలా దిక్కులు చూసిన
బాలింత మొహం
బిడియంతో పోరుకు సిద్ధపడుతుంది
కొడుకు ఆకలిముందు
తల్లి సిగ్గు
పదిమందిలో ఓడిపోయింది
నీళ్లు దొరకని నడి రోడ్డుపై
చంటి పిల్లల ఆకలి
ఎండమావియై
ఊగుతోంది
వీపు మీదున్న బుడ్డోడి
బొడ్డు ఎండకు పెక్కుకట్టి
తల్లి వెన్నెముక
ఆస్పత్రిలోని పడక మీద
పేషెంటయ్యింది
ఏడుస్తున్న ఏడుపును
ఆపగలమా
పోతున్న తల్లి సిగ్గునాపగలమా
తరలి వెళ్తున్న గమ్యానికి వేల
నడకలో ఉన్న ఇట్లాంటి
బానిస బాలింతలెందరో
ఏడ్చే రాగాన్ని తల్లికి
వినపకుండా
పెదాల మధ్యలో నొక్కిపట్టుకున్న
అగర్భ ఆకలి శ్రీమంతులెందరో
వీళ్ల కాళ్ళు రైళ్ల పట్టాల వలే
ఎంత గట్టివో
కళ్ల ముందున్న లక్ష్యాన్ని చేరలేక
కాదంటున్నాయి
చత్తిరి కూడా లేని
చైత్రమాసంలో వాళ్ళెత్తిన
మూటలే గొడుగుల్లా మారాయి
వర్షం వెలిసి మేఘానికి
పూసిన ఇంద్రధనుస్సుకు
రంగులెవడు అద్దిండో
బాటసారుల ఆత్మస్థైర్యాన్ని
ఇంత వజ్రంగా ఎవడు చెక్కిండో
ప్రతి రస్తా చౌరస్థాగా మారి
వేసే అడుగులకు
స్వాగతమిస్తున్నాయి
కారుతున్న చెమట
చుక్కలు
కుంతలా జలపాతంలోని
గోదావరి నీళ్లయ్యాయి
పర్రెలు బాసిన అరికాళ్ళు
గంగమ్మను ముద్దాడి
ఒడిలో ముడుచుకుని
కూచున్నాయి
సితార 01.05.2020
సమయం 8.33
మేడ్చల్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి