నా సెల్ 9000470542

నేనొట్టి మట్టినే



నాకు గౌరవ మర్యాదలనే
ముసుగులొద్దు
శ్రీ, గారు అని వెనకా ముందు
తోకలొద్దు
నన్నుగా బతకనివ్వండి
నన్ను నేనుగా ఉండనివ్వండి
నాకే కీర్తి వద్దు
ఏ కిరీటం పెట్టవద్దు
నా తల అట్లాంటి 
ఉంపుడుగత్తెల వంటి
పెట్టుడు కిరీటాలు పెట్టుకోదు
నేనెవరికి బానిసను గాను
నాకెవరు గులాంగిరీలు కావద్దు
మనిషిలా శ్వాసించనివ్వండి
మాటల్తో రంగులద్ది 
రాజును చెయ్యకండి
నేను మీలా కుళ్లు కుతంత్రాల
రైలు పట్టాల మీద నడవలేను
తలలపై అడుగులేసి అధోలోకానికి
పొమ్మనలేను
నాకే ఉత్తరీయాలు వద్దు
అంగులీయకాలు ముద్దు కాదు
నా మటుకు నన్నొదిలేయండి
పేరు ప్రతిష్టల వ్యామోహం
నాకంటించకండి
పూల దండలతో పూజించకండి
సన్మానాలతో శృంగారం చేయమనకండి
మీ స్వార్థపు పడకలపై
నన్ను వేశ్య చేయకండి
అట్లాగని నన్ను పతివ్రతా అనకండి
కాసుల కొరకై నన్ను నేనమ్ముకొను
బహుమతుల కోసం ఒకరి పక్కల
నగ్నంగా పడుకోను
భుజాలపై కండువాల కోసం
మీతో సంసారం చేయలేను
నే రాసిన అక్షరాలే
నా వారసులు
అందించిన పొత్తాలే 
ఆస్తులు
వీటిని కబ్జా పెట్టి కాజేయకండి
మంటల్లో కాల్చేయకండి
ఇవి దూప దీప నైవేద్యాలు లేని
అనశ్వర మందిరాలు


             సితార 30.04.2020

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కవిత్వం

ఒక స్త్రీ తన జీవితంలో ఎన్నోసార్లు పుష్పిస్తుంది. తాను పుష్పించిన ప్రతిసారీ తన పరిమళాన్ని తానే అసహ్యించుకుటుంది. 

వ్యాసం