నా సెల్ 9000470542

                 నేనూ  వరూధిని 



ఇప్పుడే విచ్చుకుని రసాన్ని 
గుమ్మరించినట్టు 
ఎక్కడ నుంచో
వెయ్యి స్వీట్ల తియ్యదనం
గుప్పుమంటుంది
నాకేదో అనుమానమోస్తుంది
నేనేమి
పర్వతాల్లో
లేను కదా
ఇక్కడ పెద్దన కూతురు 
వరూధిని కూడ లేదు కదా
ఏమో మరి 
ఎండాకాలంలో కాళ్ళు
చుయ్ చుయ్ అంటుంటే
కాళ్లకు పసరు రుద్దుకున్నానేమోననే
విశాల సందేహం 
ప్రవరుణ్ణి చేస్తుంది
మీరు తప్పుపట్టకండి
మెదడేమి తుప్పు పట్టలేదు
నేనసలు పెద్దనకు అల్లున్నే కాదు
కాకపోతే ప్రవరుడికి మాత్రం తమ్ముడ్నే
నేను వరూధిన్నసలు 
అనుమానించలేదే
ఇనుప కచ్చడాలు కట్టుకోమని 
చెప్పనూలేదే
ఇంకోసారి నా నోట
ఆ మాట చెప్పించకు
అల్లసాని పెద్దన ముద్దుల 
వరమైన వరూధిని వేశ్యయని

నన్ను బద్నాం చెయ్యకండి
ఎవ్వరూ తిట్టకండి
వరూధిని వలచొస్తే
వయ్యారంగా లగ్గమాడుతా
ఎందుకంటే నేను గురజాడ
గిరీశాన్ని మరి
అంతకంటే ముందు
ఏమి చేతకాని 
ఆ ప్రవర గాన్ని 
గాళ్లేగరేసి కాల్తో
తంతా
ఇగ వాన్నొదిలేయ్
వరూ...
వట్టి చవటగాడు
కట్టుకున్న కచ్చడాలిప్పేయిక
ఆ దీపం వేడికి
చీకటి ఏడుస్తుంది
ఆర్పేయ్
అబ్బ ఇప్పుడాంధ్రకవితా
పితామహుడు 
కట్నమియ్యకున్నా ఫర్వాలేదు

           
          16.04.2020

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కవిత్వం

ఒక స్త్రీ తన జీవితంలో ఎన్నోసార్లు పుష్పిస్తుంది. తాను పుష్పించిన ప్రతిసారీ తన పరిమళాన్ని తానే అసహ్యించుకుటుంది. 

వ్యాసం