నా సెల్ 9000470542

          మానభంగం

ఎక్కడో మెత్తని
చర్మ సామ్రాజ్యమ్మీద
ఎవడో దండయాత్ర 
చేపట్టాడు
గుర్రాలు లేవు
గజబలులూ లేవు
వాడే రాజ్యాధిపతి కాడు
ఏ రాణికి పతి కాడు
వాడొట్టి 
పనిలేనోళ్లకు పరమ అధోపతి
విందులలో మందు తాగి
కామ కోరికలకు
నిద్రలేచినవాడు
వాడేగుద్ద కడుక్కొని
ఆశుద్ధుడు
ఏ బోధనలు వినని
గౌతముని శిష్య రహితుడు
కన్నుల్లో రతి సముద్రాన్ని
నింపుకొని
ఒక్కొక్క టెస్టోస్టిరాన్ చుక్కను
ఒళ్ళంతా బలవంతంగా 
కారుస్తున్న కౌరవుడు
వాడే సంఘంలో సభ్యుడు కాదు
ఏ అంగంలో నిర్వహణధికారి కాదు
వాడొట్టి బట్టల్ని 
కట్టుకొని
తల్లుల పొట్టల సంతోషాల్ని
నిలువునా నరికేసే 
శ్రీ రాముడి శత్రువు
అర్థరాత్రి ఆర్థనాదాలను
పలికిస్తూ
కారిన రక్తపు రంగును
రుచి చూసిన
నర భక్షకుడు
ఎక్కడో ఒక తల్లి
సుస్పష్ట రోదనలు
ప్రవచనాల్లా విన్పడుతున్నాయి
కామ మంటకు
కాలుతున్న కన్న పేగు వాసన 
ముక్కుని మూడు
దిక్కుల కేళియ నాట్యం 
చేపిస్తున్నది
గతి తప్పిన కాళ్లు 
రెండు
మతి తప్పిన మనిషికి
ప్రసాదాలయ్యాయి

       తేది:16.04.2020




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కవిత్వం

ఒక స్త్రీ తన జీవితంలో ఎన్నోసార్లు పుష్పిస్తుంది. తాను పుష్పించిన ప్రతిసారీ తన పరిమళాన్ని తానే అసహ్యించుకుటుంది. 

వ్యాసం