సాహిత్యంలో ప్రముఖ కథకులను, నవలాకారులను, వ్యాసకర్తలను మొత్తంగా వెరసి సాహితీ ప్రముఖులందరిని ఇంటర్వ్యూ చేయడం అనేది కొన్నేళ్లుగా పాతగా ఉన్న సంప్రదాయాన్ని అనుసరిస్తూ వస్తున్న నూతన పంథా.
ఈ ఇంటర్వ్యూలో ఎవరైతే, ఎదుటివారిని ప్రశ్నల రూపంలో అడుగుతారో వారు, ఎవరైతే సమాధానాల రూపంలో వాళ్ల వాళ్ళ లోపలి నిజమైన అభిప్రాయాన్ని వెలిబుచ్చుతారో వారిద్దరూ ఉంటారు.
ఈ క్రమంలో కొనసాగే ఇంటర్వ్యూలో అంతర్మనస్సులోని భావాలను నిజంగా నిక్కచ్చిగా చెప్పడం జరిగే తంతు అనేది సూటిగా మన తరం దాకా వస్తూ ఉంది.
అయితే సాహిత్యంలో ఎప్పుడైతే నిజాయితీ అనేది అస్థిరతగా పునాదులు నిర్మించుకుందో అప్పటి నుండి ఈ ఇంటర్వ్యూల విధానంలో కాస్త పస లోపించింది. ఇంతే కాకుండా ఈ రకమైన ఇంటర్వ్యూలో ఆశించినంత సత్ఫలితాలు అందడం లేదనే వాదనొకటి ఉంది. ఈ విషయం ఇంతకుముందు ఈ ప్రక్రియలో పాల్గొన్న ఇరువురికే కాక శ్రోతలకు, పాఠకులకు తెలిసిన నిజమైన నిజం.
ఇది ప్రధానంగా మౌఖిక ధోరణికి చెందిన ప్రక్రియ. కానీ దీన్ని మన పూర్వ అపూర్వ సాహితీవేత్తలు ఎవరు కూడా ఒక ఆశు సాహిత్య ప్రయోజనం గల ప్రక్రియగా గుర్తించలేకపోయారు. అలా గుర్తించే పెద్దలు ప్రక్రియ పద్దుల పుస్తకంలో నమోదు చేస్తే రాబోయే తరం వారికి ఒక సరికొత్త మౌఖిక బాండాగారంగా ఉపయోగపడుతుంది.
అయితే గత తరాల మధ్య నిర్మించిన విజ్ఞాన వారధియైన ఈ మౌఖికతలో నేనొక వినూత్నమైన పద్ధతికి ఈరోజే పచ్చ జెండా ఊపాను. దీనిలో సాహిత్య ప్రశ్నకారుణ్ణి నేనే, సమాధాన అందకారుణ్ణి(గుడ్డి కాదు) నేనే. ఇందులో కేవలం సాహిత్య అంశాలే కాకుండా సాంఘిక, తాత్విక అంశాలకు కూడా స్థానం ఉంటుంది.
సమయం :11.55
తేది. : 16.04.2020
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి