నా సెల్ 9000470542

           బాధపడ్డ గర్భిణి


ప్రకృతి నాకో 
ఇల్లును నిర్మించింది
పద్నాలుగవ ప్రాయంలో
దిష్టి తగలకుండా 
రెండు గుమ్మడి కాయల్లా
చనులను నా ఎదుటిపై
కట్టింది
నాలోకి వచ్చిపోయే 
వారికే రోగం రాకుండా
పాదాలకు పారాణి పూసింది
నాల్గు వసంతాలప్పుడే 
నన్ను ఆకుపచ్చగా చేసింది
పచ్చి బాలింతనయ్యే
సమయమొచ్చిందని
ఋతువును మానుకొమ్మంది
ఎవడో వచ్చి నా పచ్చందనాన్ని
ఎంగిలి చేయ చూశాడు
ఏమి లేకుండా నన్ను
నమిలేశాడు
నా మెడలో తాళి కట్టి
హక్కుని పొందాడు
అడగనియ్యకుండా 
ఆస్తి చేసుకున్నాడు
పెళ్లి ముసుగులో కట్న
వ్యాపారం చేస్తున్నాడు
అడిగినంత డబ్బు తేలేదని
చర్మాన్ని బొబ్బలు పెట్టాడు
ఉదయం నిద్రలేవక మునుపే
నాలాంటి వనితలెందరో
స్టేషన్ మెట్లెక్కారు
కష్టాల్ని తీర్చమంటూ
కన్నీటితో
ఖాకీలను వేడుకున్నారు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కవిత్వం

ఒక స్త్రీ తన జీవితంలో ఎన్నోసార్లు పుష్పిస్తుంది. తాను పుష్పించిన ప్రతిసారీ తన పరిమళాన్ని తానే అసహ్యించుకుటుంది. 

వ్యాసం