నా సెల్ 9000470542


              నేనెందుగ్గాను



అభినేతను గాను
అధినేతను గాను
అధోలోకం లోంచి
అధిలోకానికి ఎగరాలనుకునే
రెక్కల బలం లేని
అజ్ఞాత అంధకారుణ్ణి
             యుద్ధ ప్రకటనల
             హెచ్చరికల్లేకుండా
             ఆ మేఘం గాడు
             ఎన్ని వడగండ్లతో
             దాడి చేసాడో నీకేం తెలుసు
పాశిపోయిన చర్మపు బొంతను
వాసనొస్తున్నా పట్టించుకోకుండా  కాసేపు ముక్కును పక్కన పెట్టి
శ్వాసకు దూరంగా బతికిన ఏడాదులెన్నో
             కన్పిస్తే వాడెక్కడ పుల్ల గీరి
             మంటతో మండిస్తడన్న
             మౌన భయంతో
             ఎండలోనుండి
             నీడ కోసం చేసిన ఆహార                       దీక్షలెన్నో
అందరి చేత ప్రశంసలు
తిందామని ఆకలేసిన గానీ
తినలేని రోజులను
దినచర్య గ్రంథంలో ఎన్ని
పుటలపై రాసుకున్నానో
             నా గోస గోషాను చూసి
             ఇంతి నన్నూ సాహిత్యాన్ని
             విడదీయనీకే ఎంత పోరాడిందో
             చివరికి గెలవలేక గెలవలేక
             గెలిచావని నన్ను ఎంత
             నిద్రలేపిందో



సమయం:9.59
తేదీ.       17.04.2020



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కవిత్వం

ఒక స్త్రీ తన జీవితంలో ఎన్నోసార్లు పుష్పిస్తుంది. తాను పుష్పించిన ప్రతిసారీ తన పరిమళాన్ని తానే అసహ్యించుకుటుంది. 

వ్యాసం