నా సెల్ 9000470542


           అరెస్టు చెయ్యకండి



కథని నేనే కవిత్వాన్ని నేనే
రాత్రి రహస్య వస్తువును
                   కాజేసిన
బందిపోటును నేనే

కార్మికుణ్ణి నేనే కర్షకుణ్ణి నేనే
చాటుగా వచ్చి కష్టాల్ని
           మాయం చేసిన
మాయల ఫకీరుణ్ణి నేనే

బాలింతను నేనే బలవంతుణ్ణి నేనే
చంటి పిల్లల ఏడుపును
కొట్టేసి జేబులో పెట్టుకున్న
జేబు దొంగను కూడా నేనే


      తేది :18.04.2020

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కవిత్వం

ఒక స్త్రీ తన జీవితంలో ఎన్నోసార్లు పుష్పిస్తుంది. తాను పుష్పించిన ప్రతిసారీ తన పరిమళాన్ని తానే అసహ్యించుకుటుంది. 

వ్యాసం