నా సెల్ 9000470542

         చిల్లుపడ్డ ఆకాశం


మిన్నుకు చిల్లు పడ్డది
        మీదనున్న నీళ్లను 
కిందికి గుమ్మరిస్తున్నది

రవిగాడు బెదిరించిండేమో
        మేఘం భయపడి
ఏడుస్తూ మొత్తుకుంటుంది

ఆకాశపు తెల్లటి తెర మీద 
        ఏ చిత్రకారుడు దాక్కున్నడో
ఎవ్వరికీ కనపడకుండొచ్చి
        ఏడు రంగులు గీశాడు

వాన వెలిసినాక మేఘం 
        వెనకాల ఉండి వధువు కోసం 
చూసే దొంగ చూపుల్లా
       ఉన్నాయి వరుడి చూపులు

లోకానికి దిష్టి తగలొద్దనేమో
       మొగులుకు కాటుక 
పెట్టి వెలుగును దాచిపెట్టింది

     తేది:15.04.2020




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కవిత్వం

ఒక స్త్రీ తన జీవితంలో ఎన్నోసార్లు పుష్పిస్తుంది. తాను పుష్పించిన ప్రతిసారీ తన పరిమళాన్ని తానే అసహ్యించుకుటుంది. 

వ్యాసం