నా సెల్ 9000470542

కోవెల సుప్రసన్న గారితో

  

ఈరోజు మధ్యాహ్నం ఓ ప్రముఖ్ఆఆ సాహితీవేత్తను కలిశాను. వారు సాహిత్యంలో నిరంతర నక్షత్రం. ఎన్నో విలువైన గ్రంధాలు వారి హస్తం నుంచి జాలు వారాయి. అంతేగాక వారు చేతనావర్తన కవులలో ఒకరు. యాభై గ్రంధాలను సాహిత్య సమాజానికి అందించిన మేధావులు. వారే శ్రీ కోవెల సుప్రసన్నాచార్య గారు. ఎందరో యువకవులకు పరిశోధకులకు స్ఫూర్తిగా నిలుస్తూ ఉన్నారు. అంతటి గొప్ప వ్యక్తిని ఇవ్వాళ వారి స్వగృహంలో కలిశాను. వారితో అరవై నిమిషాల పాటు ఉండి నా పరిశోధనకు సంబంధించిన ఎన్నో మరెన్నో ఎక్కడ దొరకని వినని విషయాలను సేకరించాను. ఇంతేగాక వారితో ముఖాముఖి కూడా చేశాను. అలాగే వారి "చిన్నతనంలో విజయవాడ కృష్ణ తీరంలో మహిళలు బతుకమ్మలను నిమజ్జనం చెయ్యడం ఎంత గొప్ప దృశ్యం. అది ఊహించుకుంటే నాకిప్పటికి ఎంతో సంతోషమేస్తుంది." అని చెప్పి ఉబ్బితబ్బిబ్బయ్యారు అదిగో అంత గొప్ప సంప్రదాయం మనది.
     ఆ తరువాత చక్రవర్తి సార్ తో వారింట్లోనే ఒక నలభై నిమిషాలు సాహిత్య చర్చలు చేయడం, తగిన సలహాలు స్వీకరించడం జరిగింది


సమయం:2.49 am
తేది        :13.04.2020
స్థలం.     : మేడ్చల్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కవిత్వం

ఒక స్త్రీ తన జీవితంలో ఎన్నోసార్లు పుష్పిస్తుంది. తాను పుష్పించిన ప్రతిసారీ తన పరిమళాన్ని తానే అసహ్యించుకుటుంది. 

వ్యాసం