నా పాతికేళ్ళ ప్రయాసంలో
త్వమేవాహమ్ లా తంతెలు లేని
తలుపుల్లేని ఒంటరి
గదిని నిర్మించుకున్న
గది ప్రారంభోత్సవానికి
గగనం నుంచి దిగిరాని
గాలి మేఘలొచ్చాయి
తినడానికి తిండి పెట్టగలేను
తాగడానికి నీళ్లివిగలేను
అయిన నన్నెందుకో
ఆశీర్వదించాయి
వాడు కాళిదాసు పంపిన
మేఘుడు కావొచ్చు
మొహం చూపించి
మొహమాటం లేకుండా
నొసలు తిప్పాడు
నా గదిలో ఎందరో
కావ్య ముగ్దలు పుష్పవతి అయ్యారు
ఎందరో కన్యలు
గది నిండా కాళ్ళు చాచారు
మరెందరో ప్రౌఢలు
నన్ను అల్లుకొని
గిల్లుకుంటూ శుద్ధమైన
పరిమళమందించారు
చివరికి గోడనున్న కవుల
చేతిలో చెరచబడ్డారు
ఒక్క శకుంతల కాదు
వరూధిని కాదు
మరి గిరికా కాదు
ఎందరెందరో అకలుషిత
విరులు కలుషితమయ్యారు
నా ఆలోచన నావపైనెక్కి
నాట్యం చేస్తూ
చలాన్ని స్మరిస్తూ వెళ్లారు
నా గది ప్రారంభోత్సవానికి
వచ్చిన మేఘాలు
కావ్య నాయికలే మరి
సమయం:6.53
తేది. :12.04.2020
స్థలం. :మెదక్
త్వమేవాహమ్ లా తంతెలు లేని
తలుపుల్లేని ఒంటరి
గదిని నిర్మించుకున్న
గది ప్రారంభోత్సవానికి
గగనం నుంచి దిగిరాని
గాలి మేఘలొచ్చాయి
తినడానికి తిండి పెట్టగలేను
తాగడానికి నీళ్లివిగలేను
అయిన నన్నెందుకో
ఆశీర్వదించాయి
వాడు కాళిదాసు పంపిన
మేఘుడు కావొచ్చు
మొహం చూపించి
మొహమాటం లేకుండా
నొసలు తిప్పాడు
నా గదిలో ఎందరో
కావ్య ముగ్దలు పుష్పవతి అయ్యారు
ఎందరో కన్యలు
గది నిండా కాళ్ళు చాచారు
మరెందరో ప్రౌఢలు
నన్ను అల్లుకొని
గిల్లుకుంటూ శుద్ధమైన
పరిమళమందించారు
చివరికి గోడనున్న కవుల
చేతిలో చెరచబడ్డారు
ఒక్క శకుంతల కాదు
వరూధిని కాదు
మరి గిరికా కాదు
ఎందరెందరో అకలుషిత
విరులు కలుషితమయ్యారు
నా ఆలోచన నావపైనెక్కి
నాట్యం చేస్తూ
చలాన్ని స్మరిస్తూ వెళ్లారు
నా గది ప్రారంభోత్సవానికి
వచ్చిన మేఘాలు
కావ్య నాయికలే మరి
సమయం:6.53
తేది. :12.04.2020
స్థలం. :మెదక్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి