నువ్వొక స్వర్గపుశాలవు
నేను అందులోకి వచ్చిన అతిథిని
దాహంతో ఉన్న నన్ను
గుర్తించి నీ చెలిమెలోకి దూకమన్నావు
*
కొండల నడుమ లోయకు
పారే నీ దాహానికి అలుపు లేదు
గుండెల మీదున్న బండలకు
నీలోని మధువుకు చేదు లేదు
*
నువ్వు రెండు తీరాల
సముద్రానివి
అలలు రాని కడలివి
నేనందుకే అంట
నీలో పాలున్నాయి
నీలోపాలున్నాయని
*
పాలు మురుగుతున్నాయి
తాగని పసి కూనలెవరో
వసివాడని యవ్వనులెందరో
తేది:13.04.2020
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి