నా సెల్ 9000470542

         అర్థాంగి ప్రేమ



నీ మనస్సు బంగారమని
భార్యన్న ప్రతిసారి
స్వర్ణకారుని చేతిలో పడ్డానికి
పరుగెత్తిన
నా నాతికి 
దినదినం కొత్తగా 
కనిపించడం కోసం
నన్ను నేను శిల్పిచే
చెక్కించుకున్న
కొన్నిసార్లు ఉలి
కూడా నా ఆలోచన మకిలిని
చూసి ఉలిక్కిపడింది
మొగుడనే పితృస్వామ్య
కుతంత్రంలో ఉన్న నాకు
పెళ్ళామంటే 
పడగ్గదికొచ్చే గురజాడ
మధురవాణి లాగే 
గోచరమైంది


       తేది:18.04.2020

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కవిత్వం

ఒక స్త్రీ తన జీవితంలో ఎన్నోసార్లు పుష్పిస్తుంది. తాను పుష్పించిన ప్రతిసారీ తన పరిమళాన్ని తానే అసహ్యించుకుటుంది. 

వ్యాసం