నా సెల్ 9000470542

       పాల స్తనాలు

గుక్కపట్టిన అగర్భున్ని నోరు
భూకంపం వచ్చిన 
భూమి
ఏ దేశంలోనో పాతి పెట్టిన
పాల కుండలు 
ఒక్కటైన
పాడుబడ్డ బావి
రోధిస్తున్న బాలుడి 
మొహం రౌద్ర రసంలో
మునిగింది

పాల కొరకు పాపాలు
తెలియని పాపాయిలు
చిక్కటి చీకటి కింద
చిక్కిపోయి చనిపోయారు
అమెరికాలేదే బిమారొచ్చింది
భీమాలేని బతుకులనెన్నో
బలి తీసుకుంది

రగతం పారని రణరంగమేదో-
మనుషుల సావుకు 
శాఖబెట్టింది
దూప దీర్చుకునే 
దరిద్రుల గ్రామ దేవతలు
ఎక్కడ దూరిర్రో

మళ్లీ మొక్కుతున్న
పోలేరమ్మ 
గుడి ముందు
మడి కట్టుకొని
గంతులేస్తున్న
ఇటలీలో చూద్దామంటే
ఇల్లు 
కానొస్తలేదు!
పిల్లలకు పాలు
పడదామంటే 
ఇంతుల చళ్ళు కనిపిస్తలేవు

వెతగ్గా వెతగ్గా వెలుగులోకొచ్చాయి
పాలింకి పోయిన 
పతివ్రతా తల్లుల
రొమ్ములు 
పైసలకమ్ముడుబోయాయి
పిండడానికి దొరక్కుండా 
సన్నబడ్డాయి
పిల్లల నోళ్ళ కందకుండా
ఊగుతున్నాయి
పాల కుండలు రెండు
పగిలిపోతున్నాయి
పసిడి బతుకులు
కొన్ని కరువైతున్నాయి


           తేది:19.04.202






కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కవిత్వం

ఒక స్త్రీ తన జీవితంలో ఎన్నోసార్లు పుష్పిస్తుంది. తాను పుష్పించిన ప్రతిసారీ తన పరిమళాన్ని తానే అసహ్యించుకుటుంది. 

వ్యాసం