ప్రాంతమేదైనా ప్రజలంతా ఒక్కటే!
కవులెవరైనా సాహిత్యమంతా ఒక్కటే!
వస్తువు ఏదైనా కథ మాత్రం ఒక్కటే!
అలా శ్రీకాకుళంలో డా. ముత్యం సారు రాసిన గరిమెళ్ళ సత్యనారాయణ జీవితం సాహిత్యం పుస్తక ఆవిష్కరణకు వెళ్లాం. ఆరోజు ఘనంగా పుస్తకాన్ని పలువురు కథకులు ఆవిష్కరించారు. ఆ సభలో దాదాపుగా రెండు వందల మంది ఉన్నారు. ఈ మధ్య కాలంలో నేను చూసిన అతి పెద్ద సాహిత్య సభ ఏదైనా ఉంది అంటే అది ఇదొక్కటే అని సగర్వంగా చెప్పగలను. అలా సభ విజయవంతం అయ్యాక నేను అక్కడే మొదట సారి అంపశయ్య నవీన్ కథలు పుస్తకం విక్రయించాను. అక్కడే మొదటి సారి డా. సుంకిరెడ్డి నారాయణ రెడ్డి గారిని కలిశాను. ఆ తర్వాత కళింగాంధ్రలో ప్రసిద్ధ కథకులు అయిన శ్రీ అట్టాడ అప్పలనాయుడుని, గంటేడు గౌరీ నాయుడు గారిని కలిశాము. ఈనాడు తెలుగు వెలుగు వారి కథల పోటీలో న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన అప్పల

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి