నా సెల్ 9000470542

2019 సంవత్సరంలో హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో గుంటూరి శేషేంద్ర శర్మ గారి సాహిత్యం మీద రెండు రోజుల జాతీయ సదస్సు జరిగింది. ఆ సద స్సుకు శేషేంద్ర గారి సతీమణి కుమారి ఇందిరాదేవి ధన్ రాజ్ గిరి గారు ముఖ్య అథితులు. అలాగే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత రాచపాలెం చంద్రశేఖర రెడ్డిగారితో పాటు మరి కొందరు హాజరయ్యారు. తొలి రోజు సభానంతరం యూనివర్సిటీలోని గెస్ట్ హౌసులో రాచపాలెం గారిని నా పరిశోధన నిమిత్తం మదన్, మహేష్, నాగరాజు, మస్తాన్ లతో కలిశాను. దాదాపు అరవై నిమిషాలపాటు వారితో కథలు గురించి చర్చించాను. వారు జాతీయోద్యమ కథలు అనే పుస్తకాన్ని ముద్రించడం వల్ల నా పరిశోధనకు సగం మూలం అక్కడే దొరికింది. ఆ సందర్భంగా దిగిన ఈ చిత్రం మీ కోసం.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కవిత్వం

ఒక స్త్రీ తన జీవితంలో ఎన్నోసార్లు పుష్పిస్తుంది. తాను పుష్పించిన ప్రతిసారీ తన పరిమళాన్ని తానే అసహ్యించుకుటుంది. 

వ్యాసం