ఈ తరంలో వయస్సు మళ్ళిన కథకులకు, కథలు రాయడంలో మీసాలు దువ్వుకుంటున్న యువకులకు మార్గదర్శకులు అయిన శ్రీ కాళీపట్నం రామారావు(కారా) మాష్టారు గారితో గత సంవత్సరం వృద్యాప్య మాసంలో వారి గృహంలో మిత్రులతో దిగిన చిత్రం. వీరు కథా నిలయాన్ని స్థాపించి దానిని కథలకు బాండాగారం మార్చి ఈ తరం కథా పరిశోధకులకు, కథా పాఠక ప్రియులకు మన పూర్వులు మిగిల్చి పోయిన విజ్ఞానాన్ని అందిస్తున్నారు. వీరు ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగారు. ఎన్నో ప్రసిద్ధమైన కథలను రాసిన వారు కారా గారు . వారి కథల్లో మన అందరికి బాగా తెలిసిన కథ యజ్ఞం.
వీరి ఇంట్లోకి అడుగు పెట్టగానే ముగ్గురు ప్రసిద్ధులు గోడ మీద దర్శనమిస్తారు. వారు గురజాడ అప్పారావు, రావిశాస్త్రి, కొడవటిగంటి కుటుంబరావు. ఈ ముగ్గురు ఆయన సాహిత్యానికి వెలుగు చూపిన దివ్వెలు అని స్వయానా కారా గారే మాతో చెప్పారు.
ఆ రోజు నేను నా పరిశోధనలో భాగంగా వారితో కాస్త ముచ్చటించాను. ప్రధానంగా హైదరాబాద్ ని నిజాం పాలించే సమయంలో ఉద్యమ పరిస్థితి ఏ విధంగా ఉండేది. నాటి కథకులు ఉద్యమాన్ని ఎలా ప్రతిబింబిచారు అని నేనడిగన ప్రశ్నలకు వారు సమాధానం తెలిపి నా సందేహాలను నివృత్తి చేశారు. ఇలాంటి గొప్ప వ్యక్తిని కలుసుకున్నందుకు మేం మువ్వురం చాలా సంతోషించాం. అలాగే 27వ తేది నాడు కథా నిలయం ను సందర్శించి నాకు అనివార్యమైన కథలను కోరగా వారు ఏ మాత్రం జాప్యం చేయకుండా వెంటనే నాకు మెయిల్ చేశారు. అందుకు వారికి నేను సదా ధన్యుణ్ణి.
సమయం: 12.42
తేది. : 11.04.2020
స్థలం. : మేడ్చల్

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి