ఒకరోజు చల్లటి సాయంకాలం వేళ గురువు గారికి ఫోన్!
నేను: హాలో! నమస్కారం సార్.
గురువు : హా చెప్పు నానా.
నేను: సార్ జాతీయోద్యమ కథల గురించి కసిరెడ్డి గారిని కలవాలనుకుంటున్న
గురువు: తప్పకుండా కలవాలే. వారి దగ్గర అపారమైన జ్ఞాన సంపద ఉంది. వెళ్లి కలువు.
అని అనగానే గంట సేపాగి కసిరెడ్డి గారికి ఫోన్ కలిపా. నేను నా గురించి చెప్పాక ఇంటికి రమ్మని అన్నారు. వెళ్ళా.
అలా గంట గంటన్నర సేపు నిజాం దురంతాల గురించి, స్వాతంత్ర్య ఉద్యమం గురించి, మాట్లాడిన తరువాత నాకు చిరు కానుకగా వారు రాసిన హైదరాబాద్ లో స్వాతంత్ర్య ఉద్యమం లాంటి మూడు పుస్తకాలు ఇచ్చారు.
కసిరెడ్డి గారు తెలుగు పొడుపు కథలపై పరిశోధన చేశారు. వీరి పేరు దాదాపు సాహిత్య బంధువులందరికి మంచి పరిచయమే. అలా ఆరోజు వారింట్లో వారితో దిగిన చిత్రమిది.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి