నడి వయస్సులో నుదిటి మీద గీతలారిపోయే/ ఆ వెచ్చని ఉదయపు చీకట్లోనే ఆయువెళ్లిపోయే...
పాతిక శతాబ్దంలోనే ప్రాణాలు విడిచింది
పదిమంది మంచి కోరినందుకేనేమో పయణమయ్యింది. ఎవ్వరికీ ఏ హాని తల పెట్టలేదు. ఆమె చేసిన తప్పల్లా ఒక్కటే అందరి క్షేమం కోరడమే. మంచివారికి నూకలు బాకీ ఉండవు. ఎందుకంటే వారు మిగిల్చి పోయిన నూకలు వేరొకరికి దొరకాలి గనుక. 26 ఏళ్ల వయసులోనే 80 ఏళ్ల వయస్సులో అనుభవించవలసిన కష్టాలను పడింది. ఇన్ని కష్టాల ఫలితం చివరకు మిగిలిన మరణం. అలా ఎవరో చేసిన పాపానికి ఒక నిండు తల్లి బాల్చీ తన్నింది. 2018 మే 6వ తేదీన మా వదిన( ఘనపురం మాధవి) స్వర్గస్తురాలు అయింది. ఆమె ఆత్మకు సదా శాంతి కలగాలని.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి