తెలుగు సంరక్షణ వేదిక

చీకట్లో మగ్గిన వాడే చీకటి ప్రపంచానికి వెలుగౌతాడు

నా సెల్ 9000470542

ఎగరని పక్షులు


ఎగరని పక్షులు 















   



 Sun 15 Oct 22:07:54.162225 2017
2017 అక్టోబర్ మాసంలో నవ తెలంగాణ దిన పత్రికలో ముద్రితమైన కవిత

పరుగెడుతున్నాయి కాల
ప్రహహాంలో కట్టుకున్న భవ బంధాలు
ఎప్పటికి పగ్గాలు పడునో....
పరాకాష్టకొచ్చిన పవిత్రమైన బంధాలకు

నిలవ గలవా నీవిక్కడ నాడి లేని
మనుషుల మధ్యన
ఆగలేవా అంతులేని ప్రేమకుల మదిల
అంతమయ్యేదాకా ..ఆలోచించు

మట్టిని నమ్మిన చేతులు రెండు
బతకడానికి మట్టినమ్మాయి
నాగలి ఎత్తిన భుజములు రెండు
మట్టిముద్దలు మోస్తున్నాయి

కుమ్మరి వాములు అలసిపోయినయి
మన్ను కుండలు మాయమైనయి
పెండ్లి తంతులు సాగుతున్నయి
మెరిసే కుండలు వెలుగుతున్నయి

రాట్నపు ఇరుసులు అరిగిపోయినయి
ఎదిగే బతుకులు చీకటైనయి
వలస పక్షులు ఎగురుతున్నయి
పరదేశానికి పాకుతున్నయి

నేతగూడులు నల్లబడ్డయి
నమ్మిన చేతులు నష్టబడ్డయి
ఎండిన జీవులు ఒక్కటైనయి
ఎగరడానికి సిద్దమైనయి

రెక్కలొచ్చిన నగదుకు నేడు
విలువలేని ఆస్తులున్నాయి
శ్రమను నమ్మే మనుషులున్న
పైకమివ్వని దోపిడీ జీవులున్నయి

కదలని పెదవులు కలిసే చోటున
మాటలేవో బయటపడ్డయి
మనసుకు అందే మాటలు కావు
మదిని దోచే మాటలవి
-ఘనపురం సుదర్శన్‌, 9000470542

దీన్ని ఈమెయిల్‌ చేయండిBlogThis!Xకు షేర్ చేయండిFacebookకు షేర్ చేయండిPinterestకు షేర్ చేయండి
లేబుళ్లు: కవితలు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్త పోస్ట్ పాత పోస్ట్ హోమ్
దీనికి సబ్‌స్క్రయిబ్ చేయి: కామెంట్‌లను పోస్ట్ చేయి (Atom)

కవిత్వం

ఒక స్త్రీ తన జీవితంలో ఎన్నోసార్లు పుష్పిస్తుంది. తాను పుష్పించిన ప్రతిసారీ తన పరిమళాన్ని తానే అసహ్యించుకుటుంది. 

వ్యాసం

దుర్వినియోగాన్ని రిపోర్ట్ చేయండి

లేబుళ్లు

  • కవితలు (37)
  • గెస్ట్ స్పీకర్ గా (1)
  • చిన్న కథ (1)
  • జాతీయ సదస్సు (1)
  • నా ఆణిముత్యాలు (23)
  • నా ఇంటర్వ్యూలు (1)
  • నా మార్గదర్శకులు (1)
  • నా సహ పరిశోధకులు (1)
  • నా సితార గురించి (1)
  • నానీలు (2)
  • పత్రికలు (4)
  • పరిశోధనకై పర్యటన (2)
  • పుంస్త్రీ (5)
  • బతుకమ్మ వీక్లి (1)
  • వీడియోలు (2)
  • వ్యాసం (1)
  • సమీక్షలు (1)
  • సాహితీ ప్రముఖులతో నేను (5)
  • సినీ సంభాషణ (1)
  • స్త్రీ (1)
  • స్మృతి (2)

Pages

  • Home

కోట్స్

  • నా గురించి

Pages

  • Home

లేబుళ్లు

  • కవితలు
  • గెస్ట్ స్పీకర్ గా
  • చిన్న కథ
  • జాతీయ సదస్సు
  • నా ఆణిముత్యాలు
  • నా ఇంటర్వ్యూలు
  • నా మార్గదర్శకులు
  • నా సహ పరిశోధకులు
  • నా సితార గురించి
  • నానీలు
  • పత్రికలు
  • పరిశోధనకై పర్యటన
  • పుంస్త్రీ
  • బతుకమ్మ వీక్లి
  • వీడియోలు
  • వ్యాసం
  • సమీక్షలు
  • సాహితీ ప్రముఖులతో నేను
  • సినీ సంభాషణ
  • స్త్రీ
  • స్మృతి

నా బ్లాగు లిస్ట్‌

ఆవ్సమ్ ఇంక్. థీమ్. Blogger ఆధారితం.