నా సెల్ 9000470542

        కూయలేని కోయిల



దుస్తుల్లో ఉత్తర
దక్షిణ శరీరాలు
దూరి మానాన్ని
కాపాడుకుంటున్నాయి

తోలు పల్చనున్న 
చామన ఛాయలో
ఎముకల
పిట్టగూడు ఎదురైంది

ఎముకల మాటున
చాటు చాటుగా
గుండె ఒకటి
కూస్తునే ఉంది

ఆకుల్లేవు కవితల్లేవు
పలకడానికసలు
మాటల్లేవు
లబ్డబుల రాగమొకటే

ఎముకలు కూర్చిన 
శరీర గూడులో
పక్షి గుండెఒకటి 
గూఢచారిలా దాక్కుంది

రక్తం తెచ్చే రాయబారాన్ని
సంజయునిలా 
చవి చూసింది

భారత కురుక్షేత్రంలో
ఓడిపోయిన
ధృతరాష్ట్రుడి
కన్ను మూయించింది


           తేది:20.04.2020

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కవిత్వం

ఒక స్త్రీ తన జీవితంలో ఎన్నోసార్లు పుష్పిస్తుంది. తాను పుష్పించిన ప్రతిసారీ తన పరిమళాన్ని తానే అసహ్యించుకుటుంది. 

వ్యాసం