'తెలంగాణ జాతీయోద్యమ కథా సాహిత్యం' అనే అంశంపై చారిత్రక ప్రాధాన్యత గల్గిన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పరిశోధన చేస్తున్నాను. నా పర్యవేక్షకులు డా. సాగి కమలాకర శర్మ గారు. అయితే పరిశోధన క్రమంలో మూల విషయ సేకరణ కోసం తెలుగు రాష్ట్రాలలోని పలు ప్రముఖ గ్రంథాలయాలను, విశ్వవిద్యాలయాలను, సాహిత్య నిలయాలను, సాహిత్య పరిషత్తులను సందర్శించాను.
చాలా వరకు నాకు సమాచారం చారం దొరికిన నిలయాలలో కథా నిలయం మొదటి స్థానంలో ఉంది. ఇందుకు వారికి నేను సదా ధన్యుణ్ణి. ఈ విధమైన సమాచార సేకరణ ప్రక్రియలో శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, తూర్పుగోదావరి, హైదరాబాద్ లాంటి తదితర ప్రాంతాల్లో పర్యటించాను. ఈ పర్యటనలో నా వెనుక పరిశోధక మిత్రులు బట్టు విజయ్, మదన్ లు ఉండి ఎంతో సహకారాన్ని అందించారు.
సమయం:8.52
తేది. : 15.04.2020
అల్వాల్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి