అడ్డొచ్చిన తాళి బంధం
ఆశ మేఘాలనెక్కింది
అర్థరాత్రి బడి బత్తెల
తిరగమంటోంది
హద్దు మీరి ముద్దుల్లో
మునగమంటోంది
అందర్నీ కాదని
ఎదలనత్తుకొమ్మంది
కౌగిట్ల కారు చీకట్లో
కామాన్ని తడవమంది
అమ్ములపొదిలో ఉన్న
పిల్లాడికి రొమ్ములని
దూరం చేయమంది
భర్తంటే రాత్రి కారిన
రక్తపు మరకల్ని ఉతికే
చాకలివాన్ని చేయమంటోంది
పేగు బంధాన్ని పేలాల్లా
పెనం మీద వేయించమంటోంది
గర్భసంచిని అద్దెకిచ్చే
గదిని చెయ్యిమంటోంది
పాలు పట్టే చనులను
కిరాయి పాలికివ్వమంది
పసిపాప ఏడిస్తే
పొదల్లో పడేయమంది
అడ్డొచ్చిన మొగన్ని
మాయం చేయని
పథకం గీయమంది
భేష్!
ఎగిరిపోయింది
క్రమాన్ని వద్దని అక్రమ
శృంగార రాజ్యంలోకి
అడుగుపెట్టింది
అంగంగాన్ని పెదిమెలతో
అదిమి పట్టింది
దేహాన్ని నావను
చేసుకొని నడి రాతిరి
నడపమంది
నెలవు దప్పిన
నవల ప్రియుడి
గుండెలపై ఊగే పాలిండ్లతో
కాకతీయ నృత్యం చేసింది
తినగ తినగ తీపి
చేదయ్యింది
వత్తిన చేతులే
మత్తులో పీక నులిమింది
ఆశ హద్దు మీరి శాశ్వతంగా
అందలమెక్కింది
తేది:15.04.2020
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి