ఎడారి నగరంలో
రోడ్లన్నీ ఎడారులై
ఎండమావులతో
తడుస్తున్నాయి
దప్పిక కోసం దూడలకు
దాహం తీరని
నీళ్ళనిస్తున్నాయి
నగరం ఇంతకింత
బహిష్కృతమౌవుతుంది
నరులకు భూమ్మీద
ఓపిక లేదేమో
వంపుల రోడ్డు పక్కన
గుంపులు కడుతున్నారు
నాలుక మాటలతో
నాట్యం చేస్తుంది
చెప్పి చెప్పి
అలసి పోతుంది
సిటీలో బుద్దుడొకడే
బుద్దిగ ఉన్నడు
ఉన్న తావు నుంచి
కదలట్లేడు
నగరం నడుంమీద
నడుస్తున్న
నిరుపేదలు నయం
ఉంగరాల వంటి
బంగళాలో ఉంటున్న
బలిసినోళ్ళ కన్న
మీరు మీ ఇళ్లల్లోనే
ఉండండి
మీ మీ తల్లుల ఒళ్ళల్లోనే
పడుకొండి
కరోనా కాటేయదని
కలలు కనకండి
సమయం:2.35
తేది. :14.04.2020
స్థలం. : మేడ్చల్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి