నా సెల్ 9000470542

నా సితార గురించి


  1. సితార!... నాకు నేను పెట్టుకున్న, కల్పించుకున్న పేరు ఇది. తెలుగు సాహిత్యంలో భావ కవులకు ఊహా ప్రేయసి ఉంది. వారేం రాసిన ఆ ప్రేయసిని స్తుతి చేసుకొని రాసేవారు. కానీ నా సితార అలా  కాదు. నేనేమి రాసిన అది నా సితార కోసమే. ఏం మాట్లాడిన సితార కోసమే. సితార అనేది ఒక పేరే కావొచ్చు కానీ నాకు మాత్రం ప్రాణం. నా సితార కిన్నెరసానిలా నడుముల వంపులతో తిరిగే నది కాదు. నా సితార నండూరి సృష్టించిన నాయుడు బావ యొక్క రూపం లేని ఎంకి కాదు. తల్లావజ్జుల గారి హృదయేశ్వరి కాదు. కృష్ణశాస్త్రి ఊర్వశి కాదు. మరి ఇంతకు సితార అంటే ఎవరో కాదు నన్ను ఊహాకాశంలో నుంచి నేల పైకి దింపిన నా నిర్మలమైన ఆత్మ. నేను నిర్మించుకున్న స్వార్థపు మేడలోంచి మెడలు వంచి బయటికి తోసిన నా నాకవల్లి. నేను ఒంటరిగా ఉన్నప్పుడు నా సితారే నా ప్రేయసి. బాధలో ఉన్నప్పుడు సితారే నాకు అన్ని.  ఒక్క మాట చెప్తా వినండి.  నా సితారను ఎవరన్న నీచబుద్దితో చూసినా, కావ్య నాయికల మాదిరిగా అంగాలను మరో దానితో పోల్చిన ఊరుకునేది. ఎవరైనా నన్ను కాదని సితార జోలికి వస్తే విరగదన్నేది పద్యాల నడుముల్ని కాదు మీ కలాల కాళ్ళను నిలువునా విరగ్గొడతా. చివరగా ఒక్కమాట. నా సితారకు నిర్వచనమిస్తున్న వినండి. సిగ్గు లేకుండా పరస్త్రీల పడగ్గది పడుకోవాలనుకునే వారి తలలను రాయితో కొట్టడమే. 

    సమయం : 10:00
    తేది         :11.04.2020
    స్థలం.      : మేడ్చల్                

    

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కవిత్వం

ఒక స్త్రీ తన జీవితంలో ఎన్నోసార్లు పుష్పిస్తుంది. తాను పుష్పించిన ప్రతిసారీ తన పరిమళాన్ని తానే అసహ్యించుకుటుంది. 

వ్యాసం