నా సెల్ 9000470542

             అకించనతుడు





వాడు మాయమయ్యాడు
దిగంత మబ్బుల చాటున
ఒంటరిగా దాక్కున్నాడు
ఇన్నాళ్లు ఏ లోగిల్లోనో
కోనలోనో కొండలోనో ఉన్నాడేమో
ఇప్పుడు మాత్రం పొగకమ్మిన
తల్లి గుండె తెర వెనకాల
ఏకాంతంగా తల్లడిల్లుతున్నాడు
ఊయల్లో ఊగిన మరుక్షణం నుంచి
ఊగిసలాడుతూ అంబుధమ్ లో 
తెరమరుగయ్యాడు
ఇప్పుడు వాడు అమూర్త భావమయ్యాడు
అలసిన అలలు సేదకోసం
తీరందిక్కు పరుగెత్తినట్టు
జీవన అంబుధిలో శ్రామికుడై
స్వర్గ నశాలానికి రెక్కల్లేకుండా 
ఎగిరిపోయాడు
వాడు గరుత్మంతుడు కాదు
గంధర్వ కన్యకోసం పరుగు తీయలేడు
సరిహద్దు సంసార సాగరంలో
గజ ఈతగాడి వలే 
సుఖాల ద్వీపంలో చీకటిని
పారద్రోలే వెలుగయ్యాడు
వాడెప్పుడు వాడిన పువ్వేగానీ
వాడబడిన పువ్వు కాదు
ఒకప్పుడు వాడు సుఖాన్నన్వేషించేందుకై
కష్టాల్ని కాదన్న అకించనతుడు(పరిత్యాగం)
ఇంత కూడా సుఖం దాచుకోని
అకించనుడు
వాడెవడో కాదు నా మధ్య ఉన్నోడు
నీ మధ్య బతికినోడు
ఎవరికి అందకుండా పోయినోడు
అవినీతి వికటాట్టహాసానికి 
ప్రేక్షకుడై 
ఎదిరించ వీలుకానీ 
నిజాయితీ విలుకాడు
వాడందరికి అవసరమున్నోడు
అందమైన మనసున్నోడు
దొంగ ముండా కొడుకుల 
మధ్యన బతకడానికి ఇష్టపడనోడు
వాడే నీతికి నిలువెత్తు 
నిజాయితీ గల మానవుడు

       
                      -సితార 24.04.2020

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కవిత్వం

ఒక స్త్రీ తన జీవితంలో ఎన్నోసార్లు పుష్పిస్తుంది. తాను పుష్పించిన ప్రతిసారీ తన పరిమళాన్ని తానే అసహ్యించుకుటుంది. 

వ్యాసం